ధర్మవరంలో కూటమి నేతల సందడి..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అభివృద్ధి నివేదిక సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్, ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకా మధుసూధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సభలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు ప్రసంగించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా పాట వినిపించగా, మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన నాయకుడు చిలక మధుసూదన్ రెడ్డి వేదికపై మాస్ స్టెప్పులు వేశారు.

నాయకుల డ్యాన్స్‌ను చూసిన కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియో వైరల్‌గా మారింది.