35,000 Cr | బీఆర్ఎస్ త్వరలో పాదయాత్ర..

35,000 Cr | బీఆర్ఎస్ త్వరలో పాదయాత్ర..

ప్రాజెక్టుల పరిశీలనకు ముఖ్యమంత్రి స్వయంగా పర్యటన..
చిత్తశుద్ధి గా అధికార పార్టీ పూర్తి చేస్తుందా??
పూర్తి అయ్యేవరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఉంటుందా..?
80 వేల కోట్లతో అంచనాలతో ప్రాజెక్ట్
బీఆర్ఎస్ ఖర్చు చేసింది 27 వేల కోట్ల రూపాయలు.
2027 డిసెంబర్ పూర్తి చేయాల‌ని అధికార పార్టీ లక్ష్యం

35,000 Cr | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ,రంగారెడ్డి ,నలగొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు రాజకీయ పార్టీలకు ఎజెండాగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ ఈ ప్రాజెక్టుపై మొదలైంది రాజకీయ వేడి మొదలైంది ఇరు పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు పర్యటనలు పాదయాత్రల ప్రణాళిక సమీక్షలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులు రెండున్నర సంవత్సరాలైనా పూర్తి చేయలేదని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా దీనిపై పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించగా, మీ హయాంలో ఎందుకు చేయలేదని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నది 90 శాతం ఎలా పూర్తి చేశారని ప్రశ్నిస్తున్నారు బీఆర్​ఎస్ పార్టీ పచ్చి అబద్దాలని ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తుతున్నారు .

35,000 Cr | పదేళ్ల కాలంలో 27 వేల కోట్ల ఖర్చు..

80 వేల కోట్ల అంచనాలతో 12 లక్షల పైగా సాగునీరు అందించాలని ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 35వేల కోట్లు బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి పదేళ్ల కాలంలో 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈ మాత్రానికే 90% ఎలా పూర్తి పనులు అవుతాయని మంత్రి నిలదీశారు ఈ లెక్కలను బట్టి చూస్తే దాదాపుగా 25 నుండి 30% పనులే అయినట్లు అంచనా ఉంది 90% పనులు కాలేదని నిధుల ఖర్చును బట్టి తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోని ఏదుల నార్లాపూర్ ఉద్దండపూర్ కరివేన, వట్టెం రిజర్వాయర్ల పూర్తి కోసం పూర్తి కోసం రెండున్నర సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ చేపట్టలేదని పూర్తి చేయలేదని అధికార పార్టీపై ఈ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ పోరాట బాట పట్టింది .అందులో భాగంగా జూన్ నెలలో రిజర్వాయర్ల పాదయాత్ర చేస్తామని ఆ పార్టీ మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

35,000 Cr | పనులు వేగవంతం చేయాలి..

పాదయాత్ర ముగింపులో కేసీఆర్ తో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వంపై సమరభేరి సాగించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పోరాట బాట పడుతుందని ప్రకటన తర్వాత అధికార పార్టీలో కదలిక వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి పామూరు జిల్లా లో ప్రాజెక్టుల పూర్తి కోసం రిజర్వాయర్ల పూర్తి కోసం గత నెల రోజులుగా జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​లతో ఇంజనీర్ సాగునీటి శాఖ అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించి తగు చర్యలు చేపట్టారు అందులో భాగంగా భూసేకరణ కోసం నిధులు ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రణాళిక చేస్తామని ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

డిండి నీటి తరలింపును ఆపాలి
వచ్చే సంవత్సరం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా అధికార పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోని గత మూడు రోజుల క్రితం నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏదుల నార్లాపూర్ వట్టెం రిజర్వాయర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి వంశీకృష్ణ మెగారెడ్డి జిల్లా కలెక్టర్లు సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్వయంగా ప్రత్యక్షంగా పనుల పర్యవేక్షణ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని రెండు రోజులు బస చేసి ప్రాజెక్టులను సందర్శిస్తారని కార్యాచరణ చేసి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులపై రాజకీయ వేడి మొదలైంది పార్టీలకు ఆయుధంగా మారుతుంది ఇటీవలనే మహబూబ్​నగర్​లో జేఏసీగా ఏర్పడి ఈ విషయాలపై ఉమ్మడి జిల్లాలోని మంత్రులకు ఎమ్మెల్యేలకు పెండింగ్ ప్రాజెక్టులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిండి నీటి తరలింపును ఆపాలని వినతి పత్రాలను సమర్పించినట్లు సమాచారం.

ప్రజలలో పేరు తెచ్చుకునే అవకాశం..
అదేవిధంగా లక్ష్యం పల్లి రిజర్వాయర్ పై టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత లక్ష్మీపల్లిలో ఆందోళన నిర్వహించినట్లు సమాచారం మొత్తంగా పాలమూరు ప్రాజెక్టు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయించి వేద వేగవంతంగా పనులు చేపడితే ఈ రెండున్నర సంవత్సర కాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికార పార్టీకి కూడా ముఖ్యమంత్రి కూడా తమ హయాంలో పూర్తి చేశామని ప్రజలలో పేరు తెచ్చుకునే అవకాశం ఉంది.

CLICK HERE TO READ MORE : Nagendra Bhog | దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

CLICK HERE TO READ MORE

Leave a Reply