Huge Explosion : పల్నాడులో భారీ పేలుడు..
Huge Explosion : పల్నాడులో భారీ పేలుడు..
- ఒకరు సజీవ దహనం..
- మరొకరి స్థితి విషమం..
- బయోడీజెల్ బంకులో ప్రమాదం..
రెంటచింతల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ :
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్ (Palvayi Juncton) సమీపంలో భారీ పేలుడు కలవరం సృష్టించింది. ఇక్కడి బయో డీజిల్ బంక్ (Bio desel bunk) లో లారీ నుండి డీజిల్ అన్ లోడ్ చేసే సమయంలో మోటార్ వేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు (Huge Explosion) ‘సంభవించింది. అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ మంటల్లో ని సజీవ దహనం (A man Burn alive) అయ్యాడు. మరొకరికి విషమం (Another Person Critical) కావటంతో 108 అంబులెస్స్ లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గురజాలకు చెందిన రషీద్ ( Rasid Dead) అనే వ్యక్తి మృతిచెందాడు.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మాచర్ల అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
బయో డీజెల్ బంకులోని ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక ( Polce, Fire person in rescuie operation) సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





