LOAN | థ్యాంక్యూ సీఎం సార్…

LOAN | థ్యాంక్యూ సీఎం సార్…

రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పున్న రమేష్

LOAN | రామన్నపేట, ఆంధ్రప్రభ : చేనేత కార్మికులకు లక్షరూపాయల లోపు వ్యక్తిగత రుణాలు మాఫీ పథకం (Loan Waiver Scheme) అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన పున్న రమేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


ఆదివారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..
రుణ గ్రహీతల జాబితా ఆధారంగా, క్షేత్రస్థాయి పరిశీలన చేసి, 6780 మందిని రుణ మాఫీకి అర్హులుగా గుర్తించి చేనేత శాఖ ప్రతిపాదన సమర్పించగా 33 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి (To Chief Minister Enumala Revanth Reddy) అందుకు పూర్తి సహ కారం అందజేసిన,చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ కి,రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరభద్ర అనిల్ కు కృషి చేసిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్థపు మురళికి, పద్మశాలి సంఘంలు చేనేత కార్మికుల, పారిశ్రామికులు తరఫున రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply