భారీ వర్షంతో కూలిన ఇల్లు
భారీ వర్షంతో కూలిన ఇల్లు
- మందసలో విషాదం
ఆంధ్రప్రభ, మందస (పలాస) : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా మందస మండలం హంస ర్యాలీ పంచాయతీ సవర తుంబూరు గ్రామంలో ఇల్లు కూలి దంపతులు మృతి చెందిన విషాద సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సవర తుంబూరు గ్రామం (Savara Tumbur Village) లో ఇంటిలో గురువారం రాత్రి సవర చిన్న బుదియ, రూపమ్మ నిద్రిస్తుండగా వర్షానికి బాగా తడిచిన ఇల్లు గోడ అర్ధరాత్రి సమయంలో దంపతులపై కూలిపోయింది. సంఘటన పరిశీలించిన పరిసర ప్రాంత ప్రజలు 108 వాహనానికి సమాచారం అందించి గాయపడిన దంపతులకు హరిపురం సిహెచ్ సి కి చికిత్స అందిస్తున్న తరుణంలోని దంపతులిద్దరూ మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
