Rajya Sabha Elections | 18న పోలింగ్
Rajya Sabha Elections | 18న పోలింగ్
24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..
Rajya Sabha Elections | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి.
జూన్ 18న పోలింగ్..
ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు జూన్ 8 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనుండగా, జూన్ 11 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూన్ 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ….
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీకాలం ఈనెల 26తో ముగియనుంది. దీంతో ఈ నాలుగు స్థానాల భర్తీ కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ స్థానాలకు అధికార కూటమి ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
