వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు వినియోగించుకోవాలి

వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు వినియోగించుకోవాలి

సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘం లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల కుటుంబాలకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ వైద్య శిబిరంలో అందిస్తున్న అన్ని రకాల ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, ఎముకల పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం గురువారం కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడిఓ బాల మోహన్ రెడ్డి, ఏ డి ఓ చంద్రశేఖర్, తంగేడపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి చింతకింది కాటంరాజు, డాక్టర్ రామకృష్ణ, ఎల్లంబావి గ్రామ సర్పంచ్ గంజి వనజ కృష్ణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు గడ్డం జయశంకర్, పొట్టబత్తిని హరే కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply