ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు..
చిట్యాల, ఆంధ్రప్రభ: శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యాలయ ప్రారంభోత్సవంలో చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పాల్గొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రభుత్వ విప్ కార్యాలయం (పేషీ) ప్రారంభోత్సవానికి హాజరైన కాటం వెంకటేశం, వేముల వీరేశంకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కాటం వెంకటేశం మాట్లాడుతూ, వేముల వీరేశం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆవుల సుందర్ యాదవ్, ఆవుల సునీత–యాదయ్య యాదవ్, జోగు సురేష్, అందే రాములు, నారగోని దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
