పాశికంటి సంపత్ కు ఆత్మీయ సత్కారం

పాశికంటి సంపత్ కు ఆత్మీయ సత్కారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఏబీవీపీ ఆలేరు పూర్వ కార్యకర్తల ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్వ బాగ్ కో-కన్వీనర్ (ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట ఇన్చార్జి) గా పని చేసి ఇటీవల ఆలేరు మున్సిపాలిటీ ఐదో వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందిన పాశికంటి సంపత్ కు ఆత్మీయ అభినందన సత్కారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, చత్తిస్గర్ ఏబీవీపీ పూర్వ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నారి శెట్టి ఆదిశేషు హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి పరిషత్ కార్యకర్త సంపత్ ఆలేరు మున్సిపాలిటీలో ఐదో వార్డు కౌన్సిలర్ గా గెలవడం ఎంతో అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా సహ సంఘచాలక్ బండి రాజుల శంకర్ అభినందనలు తెలిపారు. పూర్వ బాగ్ కన్వీనర్ మైదం భాస్కర్, కార్యక్రమ కన్వీనర్ పేరపు ఆనంద్, కో కన్వీనర్ కట్కమోజి దీపక్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్ల హరీష్, ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు పులిపలు పుల మహేష్, కామిటికారి కృష్ణ, తోట మల్లయ్య, పసుపునూరి వీరేశం, కంతుల శంకర్, గంగరాజు నవీన్, మొరిగాడి వైకుంఠం, ఆలేటి శ్రీకాంత్, సురేష్ ఉల్లోజు, బట్టు క్రాంతి, అరవింద్ జూల, శ్రీధర్ పత్తి, సతీష్, పగడాల శీను, పడగంటి చంద్రశేఖర్, జూకంటి సంపత్, జూకంటి కృష్ణ, వినయ్, కవతారపు సాయి, కొమ్ము శ్రావణ్, వినీత్ పాల్గొన్నారు.
