హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేద్దాం.

హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేద్దాం.
- ఎంపీ కేశినేని చిన్ని
- బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ
- యావత్ హిందూ బంధువులంతా బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపు
- విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
విజయవాడ, ఆంధ్రప్రభ ; హనుమాన్ శోభాయాత్ర ను అందరం కలిసి విజయవంతం చేద్దామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ పిలుపునిచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ని విశ్వహిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వహిందూ పరిషత్తు యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమజ్జయంతి శోభ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా విశ్వ హిందు పరిషత్ విజయవాడ మహా నగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ జరగడం గొప్ప శుభ పరిణామం అని ఎంపీ తెలిపారు.ఈనెల 12 న విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్డు నుండి ప్రారంభం కానున్న హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ బి ఆర్ టి ఎస్ రోడ్డు నుండి ప్రారంభం అయ్యి విజయవాడ ప్రధాన కూడలిలు నుండి వెళుతూ విజయవాడ వన్ టౌన్ లోని హనుమాన్ పీఠం వద్ద ముగుస్తున్నట్లు తెలియజేశారు.
ప్రతి ఒక్క హిందూ సోదరుడికి ఎంపీ చిన్ని హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు యావత్ హిందూ సోదరులంతా పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బైక్ ర్యాలీలు ఒకేసారి జరగడం గొప్ప విషయం అని ఎంపీ చిన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ జిల్లా సేవా ప్రముఖ పి లక్ష్మీనారాయణ జిల్లా సహకార దర్శి కొంపల్లి శ్రీనివాస్ ప్రఖండ ప్రముఖ్ వీర్రాజు బజరంగ్ దళ్ కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు.
