Blanket Issue | విద్యార్థినిని హాస్టల్ నుంచి పంపించిన వార్డెన్?

Blanket Issue | విద్యార్థినిని హాస్టల్ నుంచి పంపించిన వార్డెన్?

● ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఘటన
● వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి

Blanket Issue | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ వ్యవహారశైలిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్‌లో ఉండే 8వ తరగతి విద్యార్థిని అక్షయ దుప్పటి కావాలని అడిగినందుకు ఆగ్రహించిన వార్డెన్ ఆమెను హాస్టల్ నుంచి పంపించివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.