ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…

ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…

భవానిపురం,ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆరుగురికి సీఎం సహాయనిధి కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖలు రాసారు.. నియోజకవర్గంలో వివిధ రకాల దీర్ఘ కాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధ పడే వారూ మెరుగైన వైద్యం కోసం , సర్జరీల నిమిత్తం ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు.. ఆయన ఐదుగురికి 18,93,200/- రూపాయల అంచనాతో ఎల్వోసీ లేఖలను, ఒకరికి 1,72,479/- విలువైన ఎల్వో ఆర్ లేఖలను సీఎం సహాయ నిధి కి రాసారు..

వీటికి సంబంధించిన పత్రాలను లబ్ది దారుల కుటుంబ సభ్యులకు మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అంద చేశారు.. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply