తిరుమలాయపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.

ధాన్యంలో తేమ శాతం 17లోపు ఉండేలా చూసుకోవాలని, ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply