మక్తల్ 6వ వార్డు ఉపఎన్నిక ప్రశాంతంగా సాగింపు

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ఉపఎన్నిక శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పటికీ, మక్తల్‌లో 16 వార్డులకు గాను 15 వార్డుల్లో మాత్రమే ఎన్నికలు పూర్తయ్యాయి. 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ రోజు తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ ఉపఎన్నికలో మృతి చెందిన బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప సతీమణి సత్యమ్మ బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎరుకలు మారెప్ప, బీఆర్ఎస్ అభ్యర్థిగా ముగులప్ప బరిలో ఉన్నారు. మొత్తం 1,453 మంది ఓటర్లలో తొలి రెండు గంటల్లో 297 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 20.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Leave a Reply