జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జే. జీవన్ కుమార్ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం, మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయవ్యవస్థ, పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన న్యాయ, భద్రతా సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలని ఇరువురు ఆకాంక్షించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు న్యాయపరమైన వ్యవహారాల్లో సమన్వయం కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు.
