భువనగిరి రాజ్యాధికార సమర సభకు భారీగా తరలిన నాయకులు

కాజీపేట, జూలై 5 (ఆంధ్రప్రభ): భువనగిరిలో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న రాజ్యాధికార సమర సభకు హాజరయ్యేందుకు గ్రేటర్ వరంగల్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు. కాజీపేట వాటర్ ట్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు మల్లికార్జున శాస్త్రి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మల్లికార్జున శాస్త్రి మాట్లాడుతూ రాజ్యాధికార సమర సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

భువనగిరి సభలో పార్టీ భావజాలం, భవిష్యత్ కార్యాచరణపై కీలక సందేశాలు వెలువడనున్న నేపథ్యంలో కార్యకర్తలు ఉత్సాహంగా సభకు తరలివెళ్లారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ఉపాధ్యక్షుడు రాయబారపు విజయ్ కుమార్, కార్యదర్శి మురారి రమేష్ బాబు, ప్రచార కార్యదర్శి బైరి రమేష్ గౌడ్, ప్రమీలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.