సీఎం సభకు తరలిరండి

సీఎం సభకు తరలిరండి
- ప్రభుత్వ విప్ విజయ రమణారావు
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న మంథని నియోజకవర్గంలోని కాటారం లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతున్న నేపథ్యంలో, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని ప్రభుత్వ విప్ విజయ రమణారావు పిలుపునిచ్చారు.
శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని యశోద–నరహరి ఫంక్షన్ హాల్‌లో కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డు, ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సభకు తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
