Ghantasala | కూటమి నేతలు వెకిలిగా విమర్శలు చేయవద్దు

Ghantasala | కూటమి నేతలు వెకిలిగా విమర్శలు చేయవద్దు
- రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసీ సెల్ జాయింట్ సెక్రటరీ రంగారావు
Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ పాలనతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అండగా వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు వచ్చిన సమాచారంతోనే కూటమి నేతలకు నిద్ర పట్టక అవాకులు చవాకులు పేలుతున్నారంటే వారిలో భయానికే అది నిదర్శనమని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసీ సెల్ జాయింట్ సెక్రటరీ చెన్ను రంగారావు పేర్కొన్నారు.
శుక్రవారం ఘంటసాల వచ్చిన ఆయన మాట్లాడుతూ.. జగనన్న పాదయాత్ర సమాచారంపై కృష్ణాజిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతున్న తీరు దారుణం అన్నారు. మీ నేత చంద్రబాబు కూడా జైలుకెళ్లి వచ్చాడని, ఇంకా కేసు కోర్ట్ పెండింగ్ లోనే ఉందని, బెయిల్ మీద తిరుగుతున్నాడనేది గమనించక పోవడం మీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
మూడు పార్టీలు కలిసి కూటమి ఏర్పడి ఒక పార్టీని ఓడించడానికి కష్టపడ్డారని ఏ పోత్తులేకుండా గెలిచే సత్తా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు మీ హోదాని మర్చిపోయి వెకిలిగా మాట్లాడితే మీకే అంత నష్టమని దుయ్యబట్టారు. 2029లో తాము అధికారంలోకి రావడం ఖాయమని రంగారావు ధీమా వ్యక్తం చేశారు.
