Season | ఏది మంచిది..?
Season | ఏది మంచిది..?
మామిడిలో ఉన్న పోషకాలు
పండు తినాలా? జ్యూస్ తాగాలా?
జ్యూస్ తాగితే లాభనష్టాలు
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Season | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : వేసవిలో మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి ఇష్టమైన పండు మాత్రమే కాదు, ఇది రుచి, పోషకాలను అందిస్తుంది. ఈ సీజన్లో వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండ్లు రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు మనుషులను తాజా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడతాయి.

Season | జీర్ణక్రియకు, శక్తికి మామిడి
శరీరానికి అవసరమైన విటమిన్లు, నీటి శాతం (80% కంటే ఎక్కువ) అందుతుంది. ఇది కళ్ళ ఆరోగ్యం, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. మ్యాంగోలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ,సీ లభిస్తుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మంచిది. విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే ఈ పండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయ పడుతుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు ఎనర్జీ ఇస్తాయి. వేసవిలో ఈ పండ్లను తింటే బాడీకి చల్లదనం ఇస్తుంది.
అయితే ఇక్కడ కొన్ని సందేహాలున్నాయి. మామిడి పండు తింటే మంచిదా..? జ్యూస్ తాగితే మేలు జరుగుతుందా అనేది చాలామందిలో అనుమానాలుంటాయి. అయితే జ్యూస్ కంటే పండు తినడం మేలని నిపుణులు చెబుతున్నారు. అలా అని జ్యూస్ తాగొద్దని కాదు. ఎక్కువ తాగితే కొన్ని సమస్యలున్నాయని పేర్కొటున్నారు.
జ్యూస్ తాగితే.. వెంటనే ఎనర్జీ వస్తుంది. హీట్ తగ్గించడంలో సహాయ పడుతుంది. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది అయితే జ్యూస్ చేయడం వల్ల పండులోని ఫైబర్ తగ్గిపోతుంది. షుగర్ ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు జ్యూస్ తాగకపోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను పరిమితంగా తినాలి.
