distribution | రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

distribution | పెడన, ఆంధ్రప్రభ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పెడన మండలంలో టీడీపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెడన మండల టిడిపి అధ్యక్షులు శలపాటి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి శీరం ప్రసాద్, జడ్పిటీసీ సభ్యులు అర్జ వెంకట నగేష్, మురాల ఫణి ఆధ్వర్యంలో పెడన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సామాజిక సేవే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు టిడిపి నాయకులు పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగుల ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
