వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్

వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్

రాప్తాడు, ఆంధ్రప్రభ : రైతులు ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ నూతనంగా వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు పేర్కొన్నారు. గురువారం రాప్తాడు మండల పరిధిలోని బొమ్మేపర్తి గ్రామంలో రాప్తాడు తాసిల్దార్ విజయ కుమారి ఆధ్వర్యంలో వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో కేశవ నాయుడు అకస్మికంగా తనిఖీ చేశారు.

రైతులతో రీ సర్వేలో జరిగిన పొరపాట్లు గురించి వ్యవసాయం పంటలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఒక నెలలో నాలుగు సార్లు ఒకే గ్రామంలోనే గ్రామసభలు నిర్వహించడం వలన ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆదేశించారని తెలిపారు.ఎందుకంటే గ్రామాల్లోకి అధికారులు వచ్చి గ్రామసభ నిర్వహించి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటే ఇక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఈ గ్రామ సభలో పరిష్కారం కానీ సమస్యలు మరో 3 గ్రామసభల్లో అయినా కచ్చితంగా పరిష్కారం అవుతాయని అన్నారు. రెవెన్యూ అధికారులు అందరూ గ్రామసభలోనే ఉంటారు.ఏ అధికారి సక్రమంగా పని చేయకపోయినా గ్రామ సభలోనే నిర్భయంగా అడగవచ్చు.అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు.వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలను వెంటనే చూసి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

కోర్టు కేసులలో ఉన్న భూతగాదాలను కోర్టు నుండి ఆదేశాలు వచ్చేవరకు రెవెన్యూ శాఖ ఏమి చేయలేదన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ సమస్యలను అప్పుడు పరిష్కరిస్తామన్నారు.
బొమ్మపర్తి గ్రామంలో రీ సర్వేకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రైతులు అర్జీలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ కరుణాకర్ సర్వేయర్ రామాంజనేయులు ఏవో కృష్ణ చైతన్య డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు సచివాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Leave a Reply