నిండు జీవితానికి రెండు చుక్కలు: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కడెం, ఆంధ్రప్రభ: దేశ భవిష్యత్తైన ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కడెం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శివకుమార్, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
