రెండు చుక్కలు భవిష్యత్తు అంగవైకల్యానికి చెక్ పెడుతుంది

రెండు చుక్కలు భవిష్యత్తు అంగవైకల్యానికి చెక్ పెడుతుంది

5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించాలి
నగరపాలక సంస్థ మేయర్ ధరణి మధుకర్

మంచిర్యాల, ఆంధ్రప్రభ: రెండు చుక్కలు భవిష్యత్తు అంగవైకల్యానికి చెక్ పెడుతుంది అని మంచిర్యాల నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు మేయర్ ధరణి మధుకర్ అన్నారు. ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరంలోని 32 వ డివిజన్ లో ఉదయం ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఐదు ఏళ్లలోపు ఉన్నటువంటి బాల బాలికలకు విధిగా తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని అవగాహన కల్పిస్తూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో వేయించిన చిన్నారులకు భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ఉండేందుకు తోడ్పడుతుందని ముందస్తు జాగ్రత్తలు భాగంగా జాతీయస్థాయిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది కవిత, సిబ్బందితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపతి తిరుపతి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.