నిండు జీవితానికి రెండు చుక్కలే రక్షణ
రుద్రూర్, ఆంధ్రప్రభ: పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రుద్రూర్‌లో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమానికి సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా 0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలియో వైరస్ వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధి అని, దీనికి చికిత్స కంటే నివారణే ఉత్తమ మార్గమని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అయోషా సిద్ధిఖ్, ఉప సర్పంచ్ నిసార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, ఏఎన్‌ఎంలు ప్రమీలరాణి, గౌరి, ఆశా కార్యకర్తలు నిర్మల, లత, వార్డు సభ్యుడు పోశెట్టి, అంగన్‌వాడీ టీచర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
