నిండు జీవితానికి రెండు చుక్కల పల్స్ పోలియో
నిండు జీవితానికి రెండు చుక్కల పల్స్ పోలియో
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ దుమాల మమత రాజు ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మమత (రాజు) మాట్లాడుతూ.. గ్రామంలోని పుట్టిన పిల్లల నుండి ప్రతి కుటుంబం తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రెండు చుక్కలు పిల్లల జీవితానికి బంగారు బాటలు అని పేర్కొంటూ, పోలియో చుక్కల ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి, భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్, వార్డు సభ్యులు, ఏఎన్ఎమ్, ఆశా వర్కర్, అంగన్‌వాడీ టీచర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
