“పీఎం కుసుమ్” పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

“పీఎం కుసుమ్” పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • విద్యుత్ శాఖ ఏఈ పాండు నాయక్,ఏవో వినయ్ కుమార్

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : “ప్రధాన మంత్రి కుసుమ్” పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ పాండునాయక్,ఏవో వినయ్ కుమార్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహించి డీజిల్ వాడకాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. పంట చేలల్లో సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటు చేసుకొని వాటి వల్ల విద్యుత్ అవసరాలను తీర్చుకుని అదనపు విద్యుత్ ను గ్రిడ్ కు విక్రయించి ఆదాయం పొందవచ్చునని వివరించారు.రైతులకు వివిధ అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు,సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,రైతులు తదితరులు ఉన్నారు.