విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్

నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాని నిర్మల్ జిల్లాఅదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నిర్మల్ రూరల్ మండలంలోని డ్యాంగాపూర్ గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం వంటరూంను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అక్కడున్న వారిని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకు మెనూను పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయనతో నిర్మల్ తాసిల్దార్ ప్రభాకర్. ఉపాధ్యాయులు ఉన్నారు.