బాబానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం
బాబానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలో జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బాబానగర్ గ్రామంలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరామ్ సుమలత అరవింద్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు భీమ్ రవీందర్, శ్రీకాంత్, ఆశా వర్కర్ రూప, అంగన్వాడీ టీచర్ పద్మ, వీవీలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
