ఘనంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం
ఘనంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉపాలయం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం తరుపున స్వామివార్లకు జిల్లా దేవాదాయ అధికారి, ఆలయ కార్య నిర్వహణ అధికారి నటరాజన్ షణ్ముగం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా, ఆలయ అర్చకులు చింతలపాటి సూర్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ మాసం శుద్ధ షష్టి పురస్కరించుకొని కనుల విందుగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
అనంతరం శ్రీ స్వామి వారికి పుష్పార్చన, పండ్లతో అలంకారం, పంచహారతులు, ఉభయదాతలకు మంత్ర పుష్పము, ఆశీర్వచనం, అన్నవితరణ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆలయ అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, అభిషేకపండిత్, కొత్తపల్లి సాయి కృష్ణ శర్మ, సహాయక శ్రీ నాదెళ్ళ లక్ష్మి రాఘవేంద్ర శర్మ, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించిన కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులు విందుగా వీక్షించి తరించారు.
