అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం

అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం
చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రముఖ తెలుగు హీరో అల్లుఅర్జున్ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తదాన శిభిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది యువకులు (అభిమానులు) పాల్గొని రక్త దానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
