గాయపడిన బాధితుడికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే…

గాయపడిన బాధితుడికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే…
మునుగోడు, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చోల్లేడు గ్రామానికి చెందిన జనిగల కృష్ణయ్య కుటుంబ సభ్యులు గాయపడిన విషయం తెలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఐకాన్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం, మండల సంయుక్త కార్యదర్శి మాదనబోయిన పరమేష్,స్థానిక నాయకులు సాగర్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.
