Andhakur | సంక్రాంతి ముగ్గుల పోటీలు..

Andhakur | సంక్రాంతి ముగ్గుల పోటీలు..

Andhakur, కుంటాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సందర్భంగా కుంటాల మండలంలోని అందకూర్ గ్రామంలో గురువారం ముగ్గుల పోటీలను స్థానిక సర్పంచ్ ప్రవళి, ప్రశాంత్ ల ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గులు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్ద పోటీలు నిర్వహించగా అధిక సంఖ్యలో మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగురంగుల ముగ్గులు వేసి అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలను మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ముగ్గుల పోటీల పండుగ వాతావరణం నెలకొంది. అయితే.. అందకూర్ గ్రామంలోని సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి సగం వైనవి, వినుషా రెండవ బహుమతి, ముద్దం మన్విత మూడో బహుమతి, సాయి రిషిత నాల్గవ బహుమతి, భామనపల్లి అరుణ ఐదవ బహుమతి, పసుపుల ప్రత్యూషలు గెలుపొందగా వారికి నగదు బహుమతిని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవళి ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రతి సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాలా భోగభాగ్యాలు ఉండేలా సుఖసంతోషాలతో పాడిపంటలు పండేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి కన్నం లక్ష్మణ్, మహేశ్వరరావు, ముద్దం భోజన్న, సగం గంగాధర్, రాజేశ్వర్, కన్న ముత్యం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply