రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత..

రూ.40వేల 11 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం..
ముగ్గురిపై కేసు నమోదు..

జన్నారం, ఆంధ్రప్రభ : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న టీఎస్ 18టీ 8625 నెంబరు గల ట్రాలీ వాహనాన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి గ్రామ సమీపాన ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ శనివారం సాయంత్రం తెలిపారు.

ఆ ట్రాలీ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన కడమంచి లచ్చన్న,డ్రైవర్ అరవింద్, కొనుగోలుదారుడైన లక్ష్మణచాంద మండలంలోని విద్యాల్ గ్రామానికి చెందిన నరేష్ పై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఆ వాహనంలో రూ.40వేల విలువచేసే 26 బ్యాగుల్లోని 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.