ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్
కడెం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని దిల్దార్ నగర్ గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ అన్నారు.
శుక్రవారం దిల్దార్ నగర్ గ్రామంలో గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్క జీవకోటికి ఎంతో మేలు చేస్తుందని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఐ. భూమేష్, ఉప సర్పంచ్ ఆనంద్ గౌడ్, జీపీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
