పిడుగు పడి మొక్కజొన్న పంట దగ్ధం

పిడుగు పడి మొక్కజొన్న పంట దగ్ధం

దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్నలో పిడుగు పడింది. కమ్మల సాయి కుమార్ అనే కౌలు రైతు 5 ఎకరాల మొక్కజొన్న వేయగా, గత కొద్దిరోజుల క్రితం ఈదురు గాలులు రావడంతో మొక్కజొన్న పంట చెను పూర్తిగా నెలకొరిగింది. దీంతో రైతు వేసినపంటకు పెట్టుబడి కూడా మిగులుత లేదని ఆవేదన చెందాడు.

ఇప్పుడు చేతికి వచ్చిన పంటను కూలీలతో తీపిచ్చి పంట చేనులోనే మిషన్ పెడదామని కుప్పలు కుప్పలు వేయగా అకాల వర్షానికి పిడుగు పడి రెండు ఎకరాల మొక్కజొన్న ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోవడంతో రైతుకు మొక్కజొన్న పంట భారీగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తంచేశాడు.

తెచ్చిన అప్పులు భారీగా పెరగడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిలిందని ఆవేదన చెందుతూ కన్నీరు మున్నీరయ్యాడు. వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి నష్టపోయిన రైతును వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ ఇప్ప సురేందర్, గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply