పారదర్శకమైన ఓటర్ల జాబితె సర్ లక్ష్యం

బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్

చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పారదర్శకమైన ఓటర్లు జాబితా తయారు చేయడమే (SIR )లక్ష్యమని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర గౌడ్ అన్నారు. మండలంలోని కిష్టంపేట బిఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి BLA 2 వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని SIR ద్వారా ఏ ఒక్కరి ఓటు కోల్పోయే అవకాశం లేదని గుర్తు చేశారు.ఓటర్ లిస్టులో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని కొందరు రెండు మూడు చోట్లలో ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసుకున్నారని దశాబ్ద కాలంగా చనిపోయిన వారి ఓట్లు తొలగించిన దాఖలాలు లేవని అవన్నీ సరి చేయడమే SIR లక్ష్యమని ఆయన అన్నారు. 2002లో ఓటర్ లిస్టులో తల్లిదండ్రుల పేర్లు లేని వారు 13 రకాల ఆధారాలతో తమ పేర్లను ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవచ్చని వారు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు… ఈ సందర్భంగా ఎన్రోల్మెంట్ ఫామ్ ఎలా నింపాలి 2002 ఓటర్ లిస్టు లో ఎలా మన పేరు చూసుకోవాలి అనే తదితర అంశాలపై BLA 2 లకు అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ SIR (BJP)రాష్ట్ర కోఆర్డినేటర్ హరిబాబు బి ఎల్ ఏ 1 జాడి తిరుపతి చెన్నూరు మండల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ జిల్లా కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణ రెడ్డి సీనియర్ నాయకులు డివి దీక్షితులు దేవరనేని సంజీవరావు మల్యాల రాజమల్లు మండల పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.