కట్లేరు వంతెనపై పల్టీ కొట్టిన కారు

కట్లేరు వంతెనపై పల్టీ కొట్టిన కారు

గంపలగూడెం, (ఆంధ్రప్రభ): గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్లేరు వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులకు రహదారి మార్పులు స్పష్టంగా తెలియకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.

ధ్వంసమైన పాత వంతెనకు ప్రక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెన మధ్యలో ఇరుక్కుపోయింది.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు, రాత్రి సమయంలో అప్రమత్తం చేసేలా దిశా సూచికలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.