ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళా నేతలు ఉన్నట్లు సమాచారం. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం గతకొన్ని రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ టార్గెట్‌గా ఈ ఆపరేషన్ జరుగుతోంది. శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత భాస్కర్ మృతిచెందారు. భాస్కర్‌పై రూ.25లక్షల రివార్డ్ ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.