pbksvsgt| నేడు పంజాబ్, గుజరాత్ ఢీ

pbksvsgt| నేడు పంజాబ్, గుజరాత్ ఢీ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఈ రోజు ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్ జరగనుంది. ముల్లాన్పుర్‌లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీకొననున్నాయి. గత సీజన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు చేరింది. కానీ ఆఖరి పోరులో బొక్కబోర్ల పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన ఆ జట్టుకు బలం. అతను గత సీజన్‌లో 604 పరుగులు (అతడు 50కి పైగా సగటు) చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈ సీజన్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అయ్యర్ భావిస్తున్నాడు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభమన్ గిల్ కెప్టెన్. ఇతను గత సీజన్‌లో జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. కానీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గిల్ బాగానే పరుగులు చేస్తున్నప్పటికీ బాల్స్ ఎక్కువగా తీసుకుంటున్నాడనే విమర్శలున్నాయి. గత సీజన్‌లో 650 పరుగులు చేశాడు. 155 స్ట్రైక్‌రేట్ ఉండటం ఇబ్బందికరంగా మారింది. అయితే గిల్ దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఈ సీజన్ శ్రేయస్ అయ్యర్, శుభమన్‌గిల్ ఎంతో కీలకం. భారీగా పరుగులు చేసి జాతీయ జట్టులోకి రావాలని ఈ ఇద్దరు చూస్తున్నారు. ఐపీఎల్‌లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆరు సార్లు తపడగా.. మూడు సార్లు పంజాబ్, మూడు సార్లు గుజరాత్ గెలిచి సమానంగా నిలిచాయి.

