grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి

grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి
రాప్తాడు ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ :విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకొని మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మాజీ ఎమ్మెల్సీ జెవివి రాష్ట్ర గౌరవ సలహాదారు డాక్టర్ ఎం.గేయానంద్ అన్నారు.శుక్రవారం రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం నందు ఉన్న మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యురేకా సైన్స్ ఎక్స్ ఫో లో రాష్ట్ర జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థుల అభినందన సభను నిర్వహించారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ సైన్స్ ఎప్పుడు కూడా అన్వేషించబడి ప్రయోగాలకు తట్టుకొని నిజాలను మాత్రమే విశ్లేషించగలదని అన్నారు.విద్యార్థులు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని నిలబడాలంటే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని అప్పుడే దేన్నైనా సాధించగలరని తెలియజేశారు.
విద్యార్థి స్థాయి నుండి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉద్దేశంతోనే జెవివి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు.సైన్స్ పరంగా అభివృద్ధి చెందిన దేశాలే ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. చదువుతోపాటు మంచి ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదిగెందుకు తగ్గ నియమాలు పాటించాలని విద్యార్థులకు తెలియజేశారు.
స్కూల్ కరస్పాండెంట్ కె.కృష్ణ సమీరా మాట్లాడుతూ ఈ భూమి మీద జరిగే ప్రతి చర్యకు శాస్త్రీయపరమైన కారణం ఉంటుందనే అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే మూఢనమ్మకాల జోలికి వెళ్ళమని అన్నారు. కాబట్టి విద్యార్థులు ఇప్పటినుండి శాస్త్రీయ దృక్పథం తో ఆలోచించడం అలవర్చుకోవాలని ఆమె విద్యార్థులకు తెలియజేశారు.
విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక గత 30 సంవత్సరాలుగా విద్యాసంస్థలలో సైన్స్ పరమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు.అనంతరం రాష్ట్ర జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంస పత్రాలు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి.ప్రతాపరెడ్డి జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరరాజు జిల్లా నాయకులు ఎస్.తిరుపాల్ ఎస్.లక్ష్మీనారాయణ ఎ.ప్రసాద్ వై.రామకృష్ణ ఉపాధ్యాయులు బి.పక్కిరయ్య గాయత్రి బాలాజీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
