ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే…

రాప్తాడు, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 22 నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకు రూ.1కోటి 30లక్షల ఏ.పీ.ఆర్.ఆర్.పి నిధులతో నిర్మించిన బి.టి.రోడ్డును ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రోడ్డు నిర్మాణంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాప్తాడు మండలం పుల్లలరేవులో రూ.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ 22నెలల్లోనే ఈ మండలంలో 26కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేసామన్నారు. ఇప్పటివరకు గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవుకు తారు రోడ్డు లేదని తొలిసారిగా ఈ రోడ్డు నిర్మించామన్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు తమకు ఇన్నేళ్లలో తారు రోడ్డు కూడా లేదని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడ ప్రజలు ఆనందం చూస్తుంటే తనకు కూడా చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఒక రాప్తాడు మండలంలోని కాకుండా ఎక్కడా రోడ్డు సమస్య లేకుండా చేసే విధంగా పనులు చేపట్టామన్నారు రానున్న ఏడాది లోపు అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని చెరువులకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు మరూరు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు పుల్లలరేవు సాయినాథ్ నాయుడు తెలుగు రైతు అధ్యక్షులు గోపాల్ క్లస్టర్ ఇంచార్జ్ సోమర నారాయణస్వామి మాజీ కన్వీనర్ నారాయణస్వామి టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply