న్యాయం చేయండి అధికారులు

న్యాయం చేయండి అధికారులు
- కాలువలు పునరుద్ధరించి న్యాయం చేయండి..
- 2500 ఎకరాలలో పంట ఎండిపోతుంది..
- అధికారులు పట్టించుకోవడంలేదని
- సీసీ కెమెరాలు ఎదుట ఓ రైతు దీక్ష..
నంద్యాల బ్యూరో, ఆంధ్రపభ : అధికారులు న్యాయం చేయండి అంటూ కేసీ కెనాల్ ఆఫీస్ ఎదుట దీక్ష చేపట్టిన నంద్యాల జిల్లా గోస్పాడు మండలం చింతకుంట గ్రామ రైతు చిన్న ఉసేనయ్య. అతని వివరాలను బట్టి జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల కూతబెట్టు దూరములో ఉన్న కానాల గ్రామ చెరువు కు సంబంధించినతూము మూసివేసినందున ఆ చెరువు కింద పారే 2500 ఎకరాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబర్ 19/1మరియు 19/3, మొత్తం మూడు సెంట్ల విస్తీర్ణంలో పిడబ్ల్యూడి కాలువ ఉండేది అన్నారు.

ఆ కాలువ ను జూలేపల్లి వరకు పూర్తిగా పూడ్చి వేశారని ఆరోపించారు.ప్రస్తుతం వంకల లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా పంటకు పెట్టుకుంటున్న మన్నారు.కొందరు రైతుల కు ఆ నీరు కూడ అందక వేసి న పంట పొలాల బీడు గా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలువను పునరుద్ధరించి మా పంట పొలాలకు నీళ్లు అందించే విధంగా అధికారులు సర్వే చేపట్టి కొలతలు వేయించి పంట పొలా ల కాలువను పునరుద్ధరింప చేయాలని కోరారు.
సదరు కాల్వ గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్న రు. అన్నదాతలకు అధికారులు అంటే అంత అలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. సదరు పిడబ్ల్యుడి కాల్వ కింద 2500 ఎకరాలు పంట పొలాలకు నీరందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ రైతుల పై లేదని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.
