Prithi Reddy | నేను విద్యావేత్తను.. రాజకీయ నేతను కాదు

Prithi Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తాను విద్యావేత్తనని, రాజకీయ వేత్తను కాదని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అన్నారు. ఆమె ఇవాళ బీజేపీ కార్యాలయానికి వెళ్లి.. నేతలను కలిశారు. అయితే అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… తాను మోడీ పర్యటన కోసమే బీజేపీ నేతలను కలుస్తున్నానన్నారు. తాము బీఆర్ఎస్ లో ఉన్నాం… ఇకపై కూడా అందులోనే ఉంటామన్నారు.
డిజిటల్ విద్యను ప్రమోట్ చేయడానికే తాను ప్రయత్నిస్తున్నానన్నారు. ఇటీవల శ్రీధర్ బాబును కూడా కలిసి ఆహ్వానించానన్నారు. వందేమాతరం పాడటం అనేది గర్వంగా ఉంటుందన్నారు. మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామన్నారు. క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. ప్రధాని రాకపై ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదని ప్రీతిరెడ్డి తెలిపారు.
