today gold rate| దిగొచ్చిన బంగారం ధర

today gold rate| దిగొచ్చిన బంగారం ధర
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇంతకన్నా మంచి అవకాశం రాదనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు నేల చూపు చూస్తున్నాయి. వెండి రేటు రూ.15000 మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, డాలర్ వంటి చాలా కారణాలు బంగారం ధరలు తగ్గేలా చేస్తున్నాయి. గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారంపై రూ.600 వరకు తగ్గింది. ఇక కేజీ వెండిపై కేవలం రూ.100 మాత్రమే తగ్గింది.

బంగారం ధరలు ఇలా..
తాజాగా హెచ్చతగ్గుల తర్వాత హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న బంగారం, వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ప్రస్తుతం రూ.1,52,950 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,200 వద్ద స్థిరపడింది. నిన్నటితో పొల్చుకుంటే 24క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.550 తగ్గింది.

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా బంగారం బాటలోనే నడుతుస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కూడా వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేవీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,59,900 దగ్గర కొనసాగుతుండగా హైదరాబాద్, చెన్నై, కేరళలో రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది.
