డిగ్రీ కళాశాలకు కంప్యూటర్లు అందజేసిన మంత్రి సోదరుడు

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు మాజీ ఉప సర్పంచ్ వాకిటి శేషగిరి 2 కంప్యూటర్ సిస్టమ్స్ ప్రదానం చేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయం లో విద్యార్థుల సమక్షంలో మంత్రి వాకిటి శ్రీహరి కళాశాల సిబ్బందికి అందజేశారు. ఈ సందర్బంగా డిగ్రీ మొదటి సంవత్సరం లో జిల్లాలో టాపర్స్ గా నిలిచిన నలుగురు అమ్మాయిలను మంత్రి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. డిగ్రీ కాలేజీ కి త్వరలో ఒక కొత్త భవనాన్ని కూడా నిర్మించనున్నట్లు మంత్రి విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.