గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…

హేమాక్స్ లైట్ మినీ వాటర్ ట్యాంక్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, ఆంధ్రప్రభ : తనకు జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజున రాత్రి వేల్పూర్ మండలం కేంద్రంలో మినీ స్టేడియంలో హైమాక్స్, లైట్ మినీ వాటర్ ట్యాంక్, ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.

గ్రామ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు.. గ్రామంలో ఎటువంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి రాజ్ కుమార్, ఉపసర్పంచ్ మెతరి బాలయ్య, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి వినోద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్, బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నాగధర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుల్ల రాములు, బొబ్బురు ప్రతాప్, సుంకరి రాము, దుల్ల రాజేశ్వర్, గంగారెడ్డి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply