పచ్చిరొట్ట ఎరువు విత్తనాల పంపిణీ

రైతుల‌కు అంద‌జేసిన మాజీ డీసీసీబీ

వేల్పూర్, మే 23 (ఆంధ్రప్రభ): వేల్పూర్ మండలం కేంద్రంలో సొసైటీ సహకార సంఘం అధ్యక్షుడు మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ ఏవో రాజు కలిసి రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ ప్రారంభం చేశారు. అలాగే వివిధ సహకార సంఘాల చైర్మన్లు, సర్పంచ్లు మండల వ్యవసాయ అధికారి,కలసి పచ్చలనడుకూడ,మోతే గ్రామాలలో రైతులకు పంపిణీ చేశారు.

అనంతరం మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డీ మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.యూరియా మొతదిలో వాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ శ్రీధర్,సహకార సంఘాల చైర్మన్ లు, సర్పంచ్ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రమణ, రేవంత్ రెడ్డి, దామోదర్ గౌడ్, మోహన్, డైరెక్టర్లు కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.