Reporter | ఆంధ్రప్రభ విలేకరి మృతి…!

Reporter | ఆంధ్రప్రభ విలేకరి మృతి…!

Reporter | నరసరావుపేట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ దినపత్రికలో గత 25 సంవత్సరాలుగా క్రోసూరు మండల రిపోర్టర్ గా పనిచేస్తున్న షేక్ సుభాని శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ అర్థరాత్రి 2 గంటలకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే పేపర్లో (ఆంధ్రప్రభ) గత 25సంవత్సరాల నుండి క్రోసూరు గ్రామీణ ప్రాంత రిపోర్టర్ గా పనిచేస్తున్న షేక్ సుభాని సోమవారం అర్ధరాత్రి అస్వస్థకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గుంటూరు జి జి హెచ్ కి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు.

తెల్లవారుజామున మృతి చెందారని తెలిసిన వెంటనే పలువురు పార్టీల పెద్దలు, తోటి విలేకరులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు శనివారం ఆయన పార్దివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుభాని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.

CLICK HERE TO READ MORE : Pallavi Gowd | వైద్యుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు

CLICK HERE TO READ MORE :

Leave a Reply