Dasturabad ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలనే తీర్మానం
Dasturabad ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలనే తీర్మానం
- మన ఊరు–మన బడి కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి ఐక్యంగా నిర్ణయం
దస్తూరాబాద్ (Dasturabad), ఆంధ్రప్రభ:
దస్తూరాబాద్ మండలం రేవోజిపేట్ గ్రామంలో “మన ఊరు–మన బడి” నినాదంతో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కీలక తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ కోలా మహేష్, ఉప సర్పంచ్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా, గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని, పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఐక్యంగా నిర్ణయించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించి, పాఠశాల స్థాయిని మరింత మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలను మౌలిక సదుపాయాలు, విద్యా నాణ్యత, ఇతర రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో విద్యను ప్రధాన అంశంగా తీసుకుని అందరూ కలిసి ముందుకు సాగాలని గ్రామస్తులు నిర్ణయించారు.
