Dasturabad ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

Dasturabad ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

  • గ్రామసభలో ఎంపీడీఓ రమేష్ రెడ్డి సూచన

దస్తూరాబాద్ (Dasturabad), ఆంధ్రప్రభ:

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ రమేష్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. దస్తూరాబాద్ మండలం రేవోజిపేట్ గ్రామంలో సర్పంచ్ కోలా మహేష్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు.

ఎంపీడీఓ రమేష్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులు నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, ప్రభుత్వ పథకం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శివ, ఉప సర్పంచ్ కిషోర్, పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.